Home > తెలంగాణ > Supreme Court : సుప్రీం కోర్టులో నేడు కవిత ఈడీ కేసు విచారణ..సర్వత్రా ఉత్కంఠ!

Supreme Court : సుప్రీం కోర్టులో నేడు కవిత ఈడీ కేసు విచారణ..సర్వత్రా ఉత్కంఠ!

Supreme Court  : సుప్రీం కోర్టులో నేడు కవిత ఈడీ కేసు విచారణ..సర్వత్రా ఉత్కంఠ!
X

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఎలాంటి ముందుస్తు చర్యలు తీసుకోద్దంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఈడీ నోటీసులు రద్దు చేయాలని ఆమె కోరారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. కాగా కవితకు ఇటీవల ఈడీ నోటీసులు పంపగా విచారణకు హాజరు కాలేనని చెప్పిన సంగతి తెలిసిందే. మహిళల ఈడీ విచారణ, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును కోరారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈరోజు విచారణ జరగనుంది.

కాగా సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్‌లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ నోటిసులకు కవిత గైర్హాజరవుతున్నారు. ఈడీ అధికారుల విచారణ తీరుపై కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం మహిళను ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న తమ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందని, అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని కవిత పిటిషన్ వేశారు. అందుకే తాను ఈడీ విచారణకు రాలేదని, సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తానని ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు తన న్యాయవాది ద్వారా పంపారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలని అన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందని అన్నారు.




Updated : 28 Feb 2024 9:13 AM IST
Tags:    
Next Story
Share it
Top