Sai Pallavi : జపాన్ పబ్‌లో సాయిపల్లవి.. 'ఏక్ దిన్' మూవీ టీమ్‌తో కలిసి సందడి
X
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తోంది. సాయిపల్లవి, జునైద్ ఖాన్ మధ్య ఓ అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్‌పాండే దర్శకత్వం వహిస్తున్నారు. 'ఏక్ దిన్' అనే టైటిల్‌ను ఈ మూవీకి ఫిక్స్ చేశారని తెలుస్తోంది. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో ఈ మూవీ రూపొందుతోంది.
'ఏక్ దిన్' మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం జపాన్‌లో పూర్తయ్యింది. జపాన్ షెడ్యూల్ పూర్తవ్వడంతో టీమ్ అంతా కలిసి ఓ పబ్‌లో పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో సాయి పల్లవి తన మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం డ్యాన్స్ చేస్తున్న సాయి పల్లవి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్ దేశంలో ప్రతి సంవత్సరం సపోరో స్నో అనే ఫెస్టివల్ జరుగుతుంది. సాయిపల్లవి మూవీ షూటింగ్ కూడా ఆ ఫెస్టివల్ లోనే జరిగింది.
ఇకపోతే సాయిపల్లవి మరోవైపు తెలుగులో నాగచైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇప్పటికే తండేల్ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో విడుదలైంది. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీనే కాకుండా తమిళంలో శివకార్తికేయన్‌తో కలిసి యాక్షన్ డ్రామా మూవీ చేస్తోంది. ఈ మూవీకి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.