భారీగా తగ్గిన టమాటా ధర.. కిలో ఇంత చీప్గానా
X
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత నెల రోజులుగా టమాటా రేట్లు.. సామాన్య ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. టమాటాను ముట్టుకోవాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం వంటకాల్లో ఉపయోగించే టమాటా.. ధరల కారణంగా దూరం అవుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో పెరిగిన ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిరోజు నుంచి అక్కడక్కడ కేజీ టమాటా ధర రూ.300 వరకు చేరుకున్నాయి.
గత నాలుగైదు రోజుల నుంచి టమాటా గ్రాఫ్ తగ్గిపోతోంది. ఒక్కోచోట కిలో టమాటా ధర రూ. 200 ఉండగా.. హైదరాబాద్ లో రూ. 100 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. అనంతపురం కూరగాయల మార్కెట్ లో ఏకంగా కిలో రూ.60కే అమ్మారు. కోతలు ఊపందుకున్న వేళ.. పంటను వీలైనంత తక్కువ సమయంలో అమ్ముకునేందుకు రైతులు పోటీపడటంతో ధరలు తగ్గుతున్నాయని మార్కెట వర్గాలు చెప్తున్నాయి. ఇదే కొనసాగితే మరో రెండు వారాల్లో సామాన్యుడికి అందుబాటు ధరలోకి వస్తుందని భావిస్తున్నారు.