Home > తెలంగాణ > గద్దర్ మరణానికి సంతాపంగా రేపు సెలవు ఇవ్వండి..

గద్దర్ మరణానికి సంతాపంగా రేపు సెలవు ఇవ్వండి..

గద్దర్ మరణానికి సంతాపంగా రేపు సెలవు ఇవ్వండి..
X

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన గొంతు మూగబోయింది. 77 ఏళ్ల వయసులో ప్రజా యుద్ధనౌక అస్తమించింది. ప్రజా గాయకుడిగా, ప్రజా యుద్ధనౌకగా తెలంగాణ ప్రజలకు గద్దర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన బాట, పాట భావితరాలకు చుక్కానిలా, బడుగు దీన జనుల గుండెల్లో ఆశాదీపంగా అజరామరంగా నిలుస్తుంది. ఆయన పాట ప్రజలను ఉద్యమం వైపు కదిలించింది. గద్దర్ ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని.. ప్రపంచ వ్యప్తంగా ప్రభావం చూపిన యోధుడని కొనియాడుతున్నారు.

ఈ క్రమంలో ఆయన మృతికి సంతాపంగా.. తెలంగాణ ప్రభుత్వం రేపు (సోమవారం, ఆగస్టు 7) సెలవు ప్రకటించాలని పలువురు కవులు, గాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయన గురించి నేటితరం పిల్లలకు తప్పకుండా తెలియజేయాని, పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.




Updated : 6 Aug 2023 9:52 PM IST
Tags:    
Next Story
Share it
Top