Home > తెలంగాణ > రేపు ఆ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

రేపు ఆ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

రేపు ఆ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంజారాల ఆరాధ్యులు దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు రేపు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బంజారా కమ్యూనిటీకి చెందిన రాష్ట్ర ఉద్యోగులకు సాధారణ సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 15ను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ప్రకటించింది.సేవాలాల్ జయంతి రోజు లీవ్ ప్రకంటించాలని లంబాడా సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలోనే క్యాజువల్ లీవ్ మంజూరు చేశారు. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే బంజారా కమ్యూనిటీ ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగఢ్‌లో జన్మించారని బంజారాలు బలంగా నమ్మతారు. ఆయన ఆధ్యాత్మిక గురువు. గొప్ప సంఘ సంస్కర్త జగదాంబకు అపర భక్తుడు.

బ్రహ్మచారి అయిన సేవాలాల్.. తన అద్వితీయ, అసామాన్య బోధనలతో కీర్తి ప్రతిష్టలు పొందారు. బంజారాల హక్కులు, నిజాం, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా.. 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్‌ సేవాలాల్‌ కీలకమైన పాత్ర పోషించారు. అంతేకాదు ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రభావాలకు లోనవకుండా , ఇతర మతాల్లోకి బంజారాలు మారకుండా ఆయన కృషి చేశారు. అందువల్లే బంజారాలకు సేవాలాల్ ఆరాధ్య దైవమయ్యాడు. అసలు లిపి అంటూ లేని బంజారాల భాషకు ఒక రీతిని తీసుకొచ్చింది కూడా ఆయనే. కోట్లాది బంజారాలు.. స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు , ఆచార వ్యవహారాలను పాటిస్తూ.. ఒకే భాషను మాట్లాడుతున్నారంటే అది సేవాల్ కృషి ఫలితమేనని బంజారాలు చెబుతున్నారు. వచ్చే సంవత్సరం సేవలాల్ జయంతి నాటికి రాజధాని హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ రాముల్‌ నాయక్‌ కోరగా.. కోమటిరెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే.




Updated : 14 Feb 2024 3:42 PM IST
Tags:    
Next Story
Share it
Top