Home > తెలంగాణ > రేవంత్ రెడ్డి నామినేషన్ ఎప్పుడంటే..?

రేవంత్ రెడ్డి నామినేషన్ ఎప్పుడంటే..?

రేవంత్ రెడ్డి నామినేషన్ ఎప్పుడంటే..?
X

నామినేషన్ల దాఖలుకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అగ్రనేతలంతా ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్తో పాటు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 6వ తేదీన కొడంగల్, 10న కామారెడ్డిలో నామినేషన్ పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు.

రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్తో పాటు సీఎం కేసీఆర్ బరిలో దిగుతున్న కామారెడ్డిలో పోటీకి సిద్ధమయ్యారు. గజ్వేల్ నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్.. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పోటీ చేస్తున్నారు. దీంతో ఈ సారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. రేవంత్​ రెడ్డి కామారెడ్డి బరిలో దిగుతుండటంతో సీనియర్ నేత షబ్బీర్ ​అలీకి హైకమాండ్ నిజామాబాద్​ అర్బన్​ టికెట్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్టుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన పార్టీ హైకమాండ్ మిగిలిన 19 సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటించలేదు. అయితే కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ స్థానాలపై క్లారిటీ రావడంతో మిగిలిన 17 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. నామినేషన్ల దాఖలుకు మరో 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఏ క్షణమైనా కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.

Updated : 5 Nov 2023 8:01 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top