సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన రేవంత్, ఉత్తమ్
X
కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈఓ వికాస్ రాజ్‌ను కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా నాలుగు అంశాలపై వికాస్ రాజ్ కు కంప్లైంట్ చేసినట్లు భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారుపై రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించకుండా చూడాలని కోరామని అన్నారు. హైదరాబాద్ లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని వికాస్ రాజ్ దృష్టికి తెచ్చామని అన్నారు. అసైన్డ్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం జరుగుతోందని, దీంతో పాటు ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని ఈసీఓ దృష్టికి తెచ్చినట్లు ఉత్తమ్ ప్రకటించారు.
భూరికార్డులు మారుస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఉత్తమ్ చెప్పారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడంలేదని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
#WATCH | Hyderabad, Telangana: Congress MP Uttam Kumar Reddy says, "We came to the Election Commission because we were not able to go for counting. So we requested to authorise the chief election agent to give us the election certificate. The second thing is that in the old city,… pic.twitter.com/rmPsmAhIQ6
— ANI (@ANI) December 2, 2023