Home > తెలంగాణ > ఆటుపోట్లు తట్టుకుని సీఎం సీటు పైకి..రేవంత్ రెడ్డి ప్రస్థానం

ఆటుపోట్లు తట్టుకుని సీఎం సీటు పైకి..రేవంత్ రెడ్డి ప్రస్థానం

ఆటుపోట్లు తట్టుకుని సీఎం సీటు పైకి..రేవంత్ రెడ్డి ప్రస్థానం
X

రాజకీయాల్లో ఓ సంచలనం తెలంగాణ కాంగ్రెస్ సారథి అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలోకి తీసుకెళ్లి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. ఆది నుంచి సంచలనాలకు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చినా తనదైన విధానాలు, సిద్ధాంతాలతో పాటు, పార్టీ నేతల సహకారం, అధిష్టానం ఆశిస్సులతో పార్టీని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి సడెన్‎గా కాంగ్రెస్‌లో చేరడం, ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పార్టీ అధ్యక్ష పదవి చేజిక్కుంచుకోవడం ఇప్పుడు సీఎం అభ్యర్థిగా బరిలో నిలవడానికి ఓ నేపథ్యం ఉంది. మరి రేవంత్ రెడ్డి బయోగ్రఫీ ఏమిటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం.అనుముల రేవంత్ రెడ్డి..నవంబర్ 08, 1969న మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి, వంగూర్ లో జన్మించారు. రేవంత్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఈయనకు చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. గ్రాడ్యుయేషన్ సమయంలోనే రేవంత్ రెడ్డి అఖిల భారత విద్యార్థి పరిషత్ కు లీడర్‎గా ఉన్నారు. ఉస్మానియా వర్శిటీ ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ కంప్లీచ్చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు.

రాజకీయ ప్రస్థానం :

విద్యార్ధి సంఘాల్లో క్రియాశీలకంగా పని చేసిన రేవంత్ రెడ్డి 2004లో టీడీపీలో చేరారు. 2006లో వచ్చిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు రేవంత్ రెడ్డి. అంతకు ముందే ఆయన టీడీపీలో సభ్యుడిగా చేరారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఆ సంవత్సరం రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా మహబూబ్ నగర్ జిల్లా మిడ్జెల్ మండలం నుంచి జడ్పీటీసీ మెంబర్ గా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరి దాదాపు దశాబ్దన్నర కాలంగా పార్టీలో కొనసాగారు. 2009, 2014 ఎలక్షన్లలో కొడంగల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు రేవంత్ రెడ్డి. అయితే 2018లోనూ ఆ ప్రాంతంలో హ్యాట్రిక్ సాధిస్తారని భావించినప్పటికీ ఆ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‎గా ఎంపిక :

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీన పడింది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీల క్యాండిడేట్ల ఓట్లకు డబ్బు ఆశ చూపారన్న ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మాత్రమే బాబు పరిమితమయ్యారు. దీంతో

తెలంగాణ టీడీపీని అసెంబ్లీలో నడిపించే ఛాన్స్ రేవంత్ రెడ్డికి లభించింది. అయితే పార్టీ అంతకంతకూ బలహీనపడటంతో ముఖ్య నాయకులందరూ అధికార పార్టీలో చేరారు. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని నడిపించడం కష్టతరంగా మారింది. అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లారు రేవంత్ రెడ్డి. అనంతరం కాంగ్రెస్ పార్టీవైపు అడుగులు వేశారు. ఆ పార్టీతో సంప్రదింపులు జరుపి 2017 లో అక్టోబర్ 30న ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రయాణం అనుకున్నంత సులభంగా సాగలేదు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.అయితే 2018లో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముగ్గురు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌లో ఒకరిగా సెలెక్ట్ చేశారు.

డైరెక్ట్ ముఖ్యమంత్రిగా ..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ వ్యతిరేకుల కూడలిగా చెప్పుకోదగిన వారిలో రేవంత్ రెడ్డి ఒకరు. కేసీఆర్ పైన ఆయన ఫ్యామిలీపైన తీవ్ర విమర్శులు చేసిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా జరిగిన ఎలక్షన్లలోనూ బీఆర్ఎస్ అధినేతకు తానే సరిజోడు అనిపించుకునేందుకు ప్రతీకాత్మకంగా ఆయన మీద రేవంత్ స్వయంగా పోటీ చేశారని సమాచారం. అందుకే కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీకి దిగారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఈసారి మినిస్టర్ కాకుండానే.. కేవలం ఎమ్మెల్యే నుంచి తెలంగాణ సీఎం అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తుంది.


Updated : 3 Dec 2023 5:30 PM IST
Tags:    
Next Story
Share it
Top