Home > తెలంగాణ > కొడంగల్ నుంచి పోటీ చెయ్.. సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్

కొడంగల్ నుంచి పోటీ చెయ్.. సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్

కొడంగల్ నుంచి పోటీ చెయ్.. సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్
X

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత 10 ఏండ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుంటే వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్‌లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కొడంగల్‌లో నామినేషన్ వేయాలని అన్నారు.

కొడంగల్‌ను దత్తత తీసుకొని, ప్రతి ఎకరానికి కృష్ణా నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్, కేటీఆర్లు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మన్నులో కలిపి.. పాలమూరు- రంగారెడ్డి తీసుకొస్తానని కొడంగల్‌ను ఎడారిగా చేశారని పైర్ అయ్యారు. దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాల్లో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవని విమర్శించారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఎన్ని నిధులిచ్చారో, దత్తత తీసుకున్న కొడంగల్‌కు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఒకవేళ నిధులు ఇస్తే.. కొడంగల్‌లో జూనియర్ కాలేజీలు, కృష్ణానది జలాలు, కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎందుకు రాలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు.


Updated : 24 Oct 2023 11:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top