ట్విట్టర్ వార్.. రేవంత్ రెడ్డి వర్సెస్ కవిత..
X
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్లో టీపీసీసీ చీఫ్ రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల యుద్ధం నడిచించింది. ప్రస్తుతం వీరి ట్వీట్స్ నెట్టింట వైరల్గా మారాయరేవంత్ రెడ్డి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలవడంపై కవిత సెటైరికల్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం అని విమర్శించారు. ‘‘అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ... కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం...ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’’ అని కవిత ట్వీట్ చేశారు.
అప్పుడు ఢిల్లీ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 2, 2023
ఇప్పుడు ఢిల్లీ... కానీ ఇప్పుడు వయా బెంగళూరు
కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం...
ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం... pic.twitter.com/dRJN89lamJ
ఈ ట్వీట్కు రేవంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అనే అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ‘‘గల్లీలో సవాల్లు...ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు. జగమెరిగిన 'నిక్కర్'..లిక్కర్ లాజిక్కు’’ అని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. దీనికి కేసీఆర్ వంగి మోదీకి నమస్కరించే ఫొటోను జతచేశారు.
🔥గల్లీలో సవాల్లు...
— Revanth Reddy (@revanth_anumula) September 2, 2023
ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు...
ఇది కేసీఆర్ మ్యాజిక్కు..
జగమెరిగిన 'నిక్కర్'...లిక్కర్... లాజిక్కు
#BRSBJPBhaiBhai #ByeByeKCR https://t.co/aP6c7reEe6 pic.twitter.com/KH8gJy0rfG