కాంగ్రెస్ను గెలిపించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం - రేవంత్ రెడ్డి
X
పాలమూరు ప్రజలు జెండాలు, అజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్ ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన నాగర్ కర్నూర్, అచ్చంపేట నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, అర్హులైన వారందరికీ రూ.4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని రేవంత్ ప్రకటించారు.
ఇందిరమ్మ రాజ్యం
ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే చేవెళ్లలో ప్రకటించిన దళిత, గిరిజన డిక్లరేషన్ అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా డిక్లరేషన్ ప్రకటించినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని రేవంత్ పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. గ్రామ గ్రామాన ప్రతి తలుపు తట్టి బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తిరగబడదాం.. తరిమి కొడదాం నినాదంతో ముందుకు వెళ్దామని రేవంత్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నెలకు రూ.4వేల పింఛన్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాలోని అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామని అన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీనిచ్చారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు..
కేటీఆర్కు కౌంటర్
ఇదిలా ఉంటే కాంగ్రెస్ది డిక్లరేషన్ సభ కాదు ఫ్రస్టేషన్ సభ అన్న మంత్రి కేటీఆర్ కామెంట్లకు రేవంత్ కౌటర్ ఇచ్చారు. యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని, “కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుకాణ్ బంద్” అని అన్నారు. కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఈ కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశారు.
మా డిక్లరేషన్ దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్.
— Revanth Reddy (@revanth_anumula) August 28, 2023
1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12… https://t.co/oxzAFlzOLQ