సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్
X
కాంగ్రెస్ కేడర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. పార్టీ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానాలు, శ్రేయోభిలాషులు ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. గత పదేండ్లుగా కాంగ్రెస్ కు అండగా.. ప్రజల తరఫున నిలబడ్డారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 2014 నుంచి అణిచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో ప్రజల పక్షాన, నిఖార్సుగా నిలబడ్డారని అన్నారు. మీ కష్టం, శ్రమ వృథా కాలేదన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్దరణలో అందరి పాత్ర మరవలేనిదని ప్రతి ఒక్కరికీ అభినందనలు చెప్పారు.
ధన్యవాదాలు..
— Revanth Reddy (@revanth_anumula) December 1, 2023
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.
గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా… pic.twitter.com/4VPl4X5uCW