Home > తెలంగాణ > Revanth Reddy: బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు - రేవంత్ రెడ్డి

Revanth Reddy: బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు - రేవంత్ రెడ్డి

Revanth Reddy: బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు - రేవంత్ రెడ్డి
X

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో పండిన పంట కొనే పరిస్థితి లేదని రేవంత్ విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీకే రుణాలు, సాగునీరు, ఉద్యోగాలు ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వృద్ధులకు సకాలంలో పింఛను డబ్బులు ఇవ్వడం లేదని, దళితులకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పిన కేసీఆర్‌ మాట తప్పారని రేవంత్‌ రెడ్డి ఫైర్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని రేవంత్ అన్నారు. అందుకే సోనియాగాంధీ మరోసారి పూనుకొని ఆరు గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఈ అంశంపై చర్చకు రమ్మని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విసిరిన సవాల్ కు సిద్ధమా అని ప్రశ్నించారు. సంగారెడ్డి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈసారి అధికారంలోకి రాగానే జగ్గారెడ్డికి కీలక పదవి ఇస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 29 Oct 2023 5:40 PM IST
Tags:    
Next Story
Share it
Top