కాంగ్రెస్ వినతిని తిరస్కరించి బీజేపీకి పర్మిషన్ ఇచ్చారు : రేవంత్
X
కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టాలన్నారు. విభజించు, పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని చెప్పారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా.. సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర నిర్వహించారు.
బీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా అన్న మోదీ ఇండియా పేరు మారుస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరు మారుస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ను తిట్టడానికే మోదీ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ సభకు అనుమతివ్వకపోవడంపై రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ వినతిని తిరస్కరించి బీజేపీ సభకు పరేడ్ గ్రౌండ్స్లో అనుమతిచ్చారని ఆరోపించారు. అమిత్ షా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 17న జరిగే సోనియా గాంధీ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా కలికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకరావాలని అన్నారు.
భారత్ జోడో యాత్ర 1వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసిసి ఇంచార్జీ శ్రీ మానిక్ రావ్ ఠాక్రే గారు, టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, టీపిసిసీ కార్యనిర్వహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు యాత్రలో భారత్ జోడో యాత్ర వార్షిక వేడుకల్లో… pic.twitter.com/fkqU3Z0NzU
— Telangana Congress (@INCTelangana) September 7, 2023