Home > తెలంగాణ > కోమటిరెడ్డితో రేవంత్ భేటీ.. ఇద్దరూ కలిసి..

కోమటిరెడ్డితో రేవంత్ భేటీ.. ఇద్దరూ కలిసి..

కోమటిరెడ్డితో రేవంత్ భేటీ.. ఇద్దరూ కలిసి..
X

తెలంగాణ రాజకీయ కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేరికలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరికలపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ తర్వాత.. పార్టీలో చేరికలపై తమ మధ్య ఎటువంటి విభేధాలు లేవని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు చెప్పారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జూపల్లి కృష్ణా రావు ఇంటికి వెళ్లారు. అక్కడ జూపల్లి సహా కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలతో రేవంత్, కోమటిరెడ్డి సమావేశమవుతారు. ఆ తర్వాత నేతలంతా కలిసి పొంగులేటి శ్రీనివాస్ ఇంటికి వెళ్తారు. పార్టీలో ఏ రోజున చేరడంపై వారితో చర్చిస్తారు. కాగా పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

రేపు రేవంత్ తో కలిసి వారు ఢిల్లీ వెళ్తారు. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఈ నెలాఖరున ఖమ్మం, నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ సభలకు రాహుల్, ప్రియాంకలు ముఖ్య అతిథులుగా వచ్చే అవకాశం ఉంది.

Updated : 21 Jun 2023 3:39 PM IST
Tags:    
Next Story
Share it
Top