Home > తెలంగాణ > రేవంత్ రెడ్డి మిస్సింగ్ పోస్టర్లు.. ఇంతకీ మ్యాటరేంటంటే..

రేవంత్ రెడ్డి మిస్సింగ్ పోస్టర్లు.. ఇంతకీ మ్యాటరేంటంటే..

రేవంత్ రెడ్డి మిస్సింగ్ పోస్టర్లు.. ఇంతకీ మ్యాటరేంటంటే..
X

లోక్ సభ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో పలుకాలనీల్లో అతికించిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి 2020లో వరదలు ముంచెత్తినప్పుడు నియోజకవర్గంలో కనిపించలేదని, ఇప్పుడు కూడా వరద పోటెత్తినా బాధితులను పరామర్శించేందుకు రాలేదని స్థానికులు అంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మల్కాజ్గిరిలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.





నగరంలో వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించింది. దీనిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రతిపక్ష నేతలు ఆందోళనలు, నిరసనలు మాని ప్రజలకు సాయం చేయాలని హితవు పలికారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కనిపించడంలేదంటూ పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పోస్టర్ల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.




Updated : 28 July 2023 3:10 PM IST
Tags:    
Next Story
Share it
Top