Home > తెలంగాణ > బిర్లా టెంపుల్‌, నాంపల్లి దర్గా వద్ద రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

బిర్లా టెంపుల్‌, నాంపల్లి దర్గా వద్ద రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

బిర్లా టెంపుల్‌, నాంపల్లి దర్గా వద్ద రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
X

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్‌లో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు చేశారు. బుధవారం ఉదయం గాంధీభవన్ నుంచి రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ పలువురు నేతలు బిర్లా టెంపుల్‌కు బయలుదేరారు. అయితే గాంధీభవన్ ముందు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఐదుగురు మాత్రమే వెళ్లాలని సూచించారు. దీంతో రేవంత్, ఠాక్రే, అంజన్ కుమార్, మల్లు రవి మాత్రమే బిర్లా మందిర్‌‌కు వెళ్లారు. బిర్లా టెంపుల్‌లో వేంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి రేవంత్ రెడ్డి పూజలు చేశారు. ఆ తర్వాత వీరంతా నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కాగా, గెలుపుపై అన్ని ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచే పోల్ మేనేజ్ మెంట్ స్టార్ట్ చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యాయి. ప్రచారం కంటే పోల్ మేనేజ్ మెంట్ ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ అభ్యర్థులకు పోల్ మేనేజ్ మెంట్ చేయడానికి కాస్త సులభంగా ఉంటుందని వివరిస్తున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు డబ్బులు పంచిన తర్వాత వారితో ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం తమ ఆరు గ్యారంటీలతో ఓట్లు కొల్లగొడతామని గట్టి నమ్మకంతో ఉంది.

Updated : 29 Nov 2023 8:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top