కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నా : రేవంత్ రెడ్డి
X
మంత్రి కేటీఆర్ సవాల్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్ కాంగ్రెస్కు సవాల్ విసిరారు. ఈ సవాల్కు సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై కేటీఆర్, హరీష్ రావు చర్చకు సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో ఐదు అంశాలతో ప్రజల్లోకి వెళ్తామని రేవంత్ చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని రేవంత్ ప్రకటించారు. పార్టీ, ప్రజల కోసం పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు.
గడీల పాలన కోసమే ధరణి పోర్టల్ తెచ్చారని రేవంత్ ఆరోపించారు. కొద్దిమంది భూస్వాముల కోసమే ధరణిని తీసుకొచ్చారని.. వేల ఎకరాల భూములను కేసీఆర్ బినామీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ధరణి రాకముందుకు కూడా రైతు బంధు వచ్చిందని గుర్తు చేశారు. ధరణి రద్దు అయితే.. రైతు బంధు రాదని కేటీఆర్, కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు.
డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని అని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అన్నారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ కలిసకట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.