Home > తెలంగాణ > ప్రభుత్వమే కబ్జా కోరుగా మారి భూములు అమ్ముకుంటుంది : రేవంత్

ప్రభుత్వమే కబ్జా కోరుగా మారి భూములు అమ్ముకుంటుంది : రేవంత్

ప్రభుత్వమే కబ్జా కోరుగా మారి భూములు అమ్ముకుంటుంది : రేవంత్
X

తెలంగాణలో కేసీఆర్ లక్ష కోట్ల దోపిడికి పాల్పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్పై చర్యలు తీసుకుంటుందని మాజీమంత్రి చంద్రశేఖర్ బీజేపీలో చేరారని.. కానీ ఆ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖర్ను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో చంద్రశేఖర్ తన వంతు కర్తవ్యం నిర్వహించారని చెప్పారు.

దళితులు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు సంబంధించి వారికే పూర్తి యాజమాన్య హక్కు కల్పించాలని చంద్రశేఖర్ సూచించినట్లు రేవంత్ తెలిపారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందన్నారు. ఈ నెల 18న మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా సభ నిర్వహించనున్నట్లు రేవంత్ తెలిపారు. ఈ సభలో పేదలకు మేలు జరిగేలా డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలను వదిలించేందుకు ప్రజలు కాంగ్రెస్తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి భూములు అమ్ముకుంటోందని రేవంత్ ఆరోపించారు. దళితులకు చెందిన 35లక్షల ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం దోచుకుందన్నారు. కేసీఆర్ అత్యంత అవినీతికి పాల్పడ్డ సీఎం అని విమర్శించారు. బీజేపీ - బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం అని అన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. అంతేకాకుండా వారి మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి.. వారికి హక్కులను కాపాడతామన్నారు.


Updated : 13 Aug 2023 2:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top