బీఆర్ఎస్ - బీజేపీది ఫెవికాల్ బంధం.. మోదీ అదే చెప్పిండు : రేవంత్
X
మోదీ - కేసీఆర్ చీకటి మిత్రులనేది పచ్చి నిజం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని విమర్శించారు. కేసీఆర్ ఎన్డీఏ పంచన చేరాలనుకున్నది నిజమని.. కాంగ్రెస్ మొదటి నుంచి ఇదే విషయం చెప్పిందన్నారు. మోదీ ఆశీస్సులతో కేటీఆర్ను సీఎం చేయాలనుకున్నారని.. మోడీ మాటలతో ఆ నిజం నిగ్గతేలిందన్నారు. దీనికి సంబంధించి రేవంత్ ట్వీట్ చేశారు.
నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిసిట్లు చెప్పారు. ఆ సమయంలో ఎన్డీఏలో చేర్చుకోవాలని కోరారని.. దానికి తాను ఒప్పుకోలేదన్నారు. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని.. అయితే మీరేమైనా రాజులా అని కేసీఆర్ను ప్రశ్నించినట్లు మోదీ తెలిపారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఆయన ముందు పెట్టానని స్పష్టం చేశారు. కేసీఆర్కు తన కళ్లలోకి చూసే ధైర్యం లేదని మోదీ ఎద్దేవా చేశారు.
మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను సీఎం అవ్వడానికి ప్రధాని పర్మిషన్ అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్పై మోదీ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు పక్కా వస్తుందని సెటైర్ వేశారు. సినిమాలకు స్క్రిప్ట్ రాస్తే అది సూపర్ హిట్ అవుతుందన్నారు. నిజామాబాద్ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. ప్రధాని స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం బాధాకరమన్నారు. ఎన్డీఏలో చేరాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు.
🔥బీఆర్ఎస్ , బీజేపీ ఫెవికాల్ బంధం…
— Revanth Reddy (@revanth_anumula) October 3, 2023
కాంగ్రెస్ మొదటి నుండి చెబుతున్న నిజం.
కేసీఆర్ ఎన్డీఏ పంచన చేరాలనుకున్నది నిజం.
మోడీ ఆశీస్సులతో కేటీఆర్ ను సీఎం చేయాలనుకున్నది నిజం.
ఇప్పటికీ మోడీ - కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చినిజం.
నిజం నిప్పులాంటిది. ఇదిగో ఇట్లా నిలకడ మీదైనా… pic.twitter.com/vwdrAjUTdh