Home > తెలంగాణ > కేసీఆర్ వచ్చినా వలసలు ఆగలేదు.. అభివృద్ధి జరగలేదు - రేవంత్ రెడ్డి

కేసీఆర్ వచ్చినా వలసలు ఆగలేదు.. అభివృద్ధి జరగలేదు - రేవంత్ రెడ్డి

కేసీఆర్ వచ్చినా వలసలు ఆగలేదు.. అభివృద్ధి జరగలేదు - రేవంత్ రెడ్డి
X

కేసీఆర్ పాలనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ సీఎం అయినా పాలమూరులో వలసలు ఆగలేదని, జిల్లా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. ఇంకా పూర్తికాని పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ నెల 16న ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా. కేవలం ఒక్కపంపు ప్రారంభించిన ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీభవన్ లో దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆ్ తొమ్మిదేళ్లలో పాలమూరుకు చేసిందేం లేదన్న రేవంత్ రెడ్డి.. గతంలో సీతా దయాకర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత నియోజకవర్గం డెవలప్ అయిందని చెప్పారు. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలకన్నా దారుణంగా తయారయ్యారని రేవంత్ ఆరోపించారు. కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప ఎమ్మెల్యేకు దేవరకద్ర అభివృద్ధి పట్టడంలేదని, నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలను పడావుపెట్టారని విమర్శించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ను గద్దె దించడం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు. ఈ నెల 16,17,18 తేదీల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, తదితర జాతీయ నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్నారని అన్నారు. ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయ భేరికి భారీగా జనం తరలిరావలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


Updated : 11 Sep 2023 3:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top