Home > తెలంగాణ > ఫేక్ ప్రచారాలు చేస్తున్నడు.. మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్

ఫేక్ ప్రచారాలు చేస్తున్నడు.. మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్

ఫేక్ ప్రచారాలు చేస్తున్నడు.. మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్
X

మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫేక్ ప్రచారాల్లో ఆయన రాటుతేలాడని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బీజేపీ దగ్గర శిష్యరికం నేర్చుకున్న కేటీఆర్ ఫేక్ ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ చూసి ఏం చేయాలో అర్థంకాక ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కర్నాటకలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మిత్ర పక్షం బీజేపీ, 40% కమీషన్లతో ఆ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని రేవంత్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుండటంతో ఇన్ని రోజులు నింపుకున్న జేబులను కేటీఆర్ దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ దొంగల దుమ్ము దులపడం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు. ‘‘కాంగ్రెస్ వస్తుంది!తెలంగాణ గెలుస్తుంది!”అని ట్విట్టర్లో రాశారు.


Updated : 21 Oct 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top