Home > తెలంగాణ > Mic Tv Breaking News: కాంగ్రెస్ లోకి జూపల్లి ,పొంగులేటి..రేపు రేవంత్ రెడ్డితో భేటీ

Mic Tv Breaking News: కాంగ్రెస్ లోకి జూపల్లి ,పొంగులేటి..రేపు రేవంత్ రెడ్డితో భేటీ

Mic Tv Breaking News: కాంగ్రెస్ లోకి జూపల్లి ,పొంగులేటి..రేపు రేవంత్ రెడ్డితో భేటీ
X

Breaking News : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరుతారన్న దానిపై క్లారిటీ వచ్చింది...బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తరువాత, అన్ని పార్టీల నేతలతో సమావేశం అయిన ఇరువురు నేతలు ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇప్పటి వరకు సస్పెన్స్ కంటిన్యూ చేశారు. మేము చేరేది ఈ పార్టీలోనే ఫలానా రోజే పార్టీ కండువా కప్పుకుంటామని ఇన్నాళ్లు ఊరించిన పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు, ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో హాట్ టాపిక్‎గా మారిన వీరి పార్టీ జాయినింగ్ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఈ విషయంలో రేపు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతోంది. గత కొన్ని రోజులుగా చేరికలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న రేవంత్ రెడ్డి రేపు ( బుధవారం) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సమావేశం కానున్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాధరంగా ఆహ్వానించనున్నారు. ఈ నెల 25న ఇద్దరు నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతారు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు. త్వరలోనే ఖమ్మం, నాగర్ కర్నూల్‎లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. ఒక సభకు రాహుల్ గాంధీ, ఒక సభకు ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.




Updated : 20 Jun 2023 8:32 PM IST
Tags:    
Next Story
Share it
Top