Home > తెలంగాణ > సీఎం అభ్యర్థిపై టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు

సీఎం అభ్యర్థిపై టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు

సీఎం అభ్యర్థిపై టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు
X

తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. రేవంత్ వ్యాఖ్యలను కోమటిరెడ్డి కొట్టిపారేశారు. సీతక్క కంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.

టీ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులకు కొదవలేదని ఠాక్రే అన్నారు. ‘‘ మాది కేసీఆర్‌లా కుటుంబ పార్టీ కాదు. రేవంత్, ఉత్తమ్, భట్టీ, మధు యాష్కీ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క లాంటి ఎంతో మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల ఆధారంగా సీఎం ఎంపిక ఉంటుంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ప్రకటన ఉండదు’’ అని ఠాక్రే చెప్పారు.

ఉచిత కరెంట్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ బలపడడం కేసీఆర్కు నచ్చలేదని.. అందుకే కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని ఠాక్రే స్పష్టం చేశారు. పదేళ్లుగా కేసీఆర్ తన కుటుంబం కోసమే పనిచేశాడన్నారు. రైతు రుణ మాఫీ చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 24 గంటల ఉచిత కరెంట్ హామీ పెడతామని ఠాక్రే వెల్లడించారు.

Updated : 12 July 2023 6:57 PM IST
Tags:    
Next Story
Share it
Top