HYDలో ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
X
రాష్ట్రంలో తగ్గిన బీజేపీ గ్రాఫ్ ను ఈ ఐదు రోజుల్లో పెంచేందుకు బీజేపీ అధిష్టానం సిద్దం అవుతుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. జనసేనతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగుతుంది. అధిష్టానం పెద్దలు ఒక్కొక్కరిగా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. కాగా ఇవాళ (నవంబర్ 25) తెలంగాణ బీజేపీ చరిత్రలో బిగ్ డే కాబోతుంది. ఎందుకంటే.. బీజేపీ అధిష్టానం నలుగురు పెద్దలు.. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆధిత్యనాథ్ లు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలు, భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాగా ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1: 25 గంటలకు దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోదీ.. మధ్యాహ్నం 2: 05 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4: 05 గంటలకు తుక్కుగూడ బహిరంగ సభలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి రాజ్ భవన్ లో బస చేస్తారు. రేపు కూడా (ఆదివారం) మోదీ పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
మోదీ పర్యటన నేపథ్యంలో ఇవాళ, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇవాళ సాయంత్రం 5: 20 నుంచి 5: 50 గంటల వరకు బేంగపేట ఎయిర్ పోర్ట్, పీఎన్ టీ ఫ్లైఓవర్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్, రాజీవ్ గాంధీ విగ్రహం, మోనప్ప ఐస్ ల్యాండ్ జంక్షన్, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, రాజ్ భవన్ ఏరియాల్లో 30 నిమిషాలపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. రేపు (ఆదివారం, నవంబర్ 26) ఉదయం 10: 35 నుంచి 11: 05 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. రాజ్ భవన్, యశోద హాస్పిటల్, మోనప్ప ఐస్ ల్యాండ్ జంక్షన్, ప్రగతి భవన్, బేగంపేట్ ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, షాపర్స్ స్టాప్, అండర్ పీఎన్ టీ ఫ్లైఓవర్, బేగంపేట్ వై ఎయిర్ పోర్ట్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.