Home > తెలంగాణ > చలాన్లు కట్టలేదని పోలీసుల వేధింపులు.. స్కూటీకి నిప్పుపెట్టిన యువకుడు

చలాన్లు కట్టలేదని పోలీసుల వేధింపులు.. స్కూటీకి నిప్పుపెట్టిన యువకుడు

చలాన్లు కట్టలేదని పోలీసుల వేధింపులు.. స్కూటీకి నిప్పుపెట్టిన యువకుడు
X

శంషాబాద్ వద్ద ఓ యువకుడు తన స్కూటీకి నిప్పుపెట్టాడు. ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ చెల్లించమన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ పరిధిలో జరిగి ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులు నీరు పోయడంతో పెను ప్రమాదం తప్పింది.

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కామన్ చెరువు ప్రాంతానికి చెందిన ఫసియుద్ధీన్ కొడుకును స్కూల్ నుంచి తెచ్చేందుకు స్కూటీపై బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ఎయిర్ పోర్ట్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ పోలీసులు స్కూటీని ఆపారు. బండి తాళాలు బలవంతంగా తీసుకొని పెండింగ్ చలాన్లు కట్టి స్కూటీ తీసుకెళ్లాలని చెప్పారు. బాబు స్కూల్ వద్ద ఎదురుచూస్తున్నాడని చలాన్లు తర్వాత చెల్లిస్తానని బతిమాలినా పోలీసులు స్కూటీ తాళాలు ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన ఫసీయుద్ధీన్ బండి పెట్రోల్ ట్యాంకర్ ఓపెన్ చేసి నిప్పు పెట్టాడు. మంటలు ఎగిసిపడుతుండటంతో పక్కనే ఉన్న పోలీసులు నీళ్లు తీసుకొచ్చి పోయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.




ఇదిలా ఉంటే ట్రాఫిక్ పోలీసులు వెర్షన్ మరోలా ఉంది. ఫసియుద్దీన్ స్కూటీపై మొత్తం 28 చలాన్లు ఉన్నాయని, వాటికి సంబంధించి చెల్లించాల్సిన రూ.9వేలల్లో కొంత మొత్తాన్ని చెల్లించి బండి తీసుకెళ్లమని చెప్పామని అంటున్నారు. అయితే ఫసియుద్దీన్ ఆవేశానికి లోనై స్కూటీకి నిప్పుపెట్టుకున్నాడని చెప్పారు.తాము అతన్ని వేధించలేదని చలాన్లు కట్టాలని మాత్రమే అడిగామని అన్నారు.

Updated : 20 Jun 2023 9:37 PM IST
Tags:    
Next Story
Share it
Top