Home > తెలంగాణ > రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వెళ్లేవారు చూసుకుని వెళ్లండి

రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వెళ్లేవారు చూసుకుని వెళ్లండి

రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వెళ్లేవారు చూసుకుని వెళ్లండి
X

తెలంగాణలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ ర‌వి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రొనాల్డ్ రోస్ క‌లిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లు డీజీపీ చెప్పారు.

సీఎం ప్ర‌మాణ‌ స్వీకార కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో గురువారం ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌లు చేయనున్నారు. లక్డీకాపూర్, బషీర్ బాగ్, ఎల్బీ స్టేడియం, అబిడ్స్ మార్గంలో ట్రాఫిక్ మళ్లించనున్నారు. వాహనదారులు అందుకు అనుగుణంగా ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు లక్ష మంది వరకు హాజరుకావచ్చని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. స్టేడియంలో 30వేల మంది కూర్చొనే సౌకర్యం ఉండగా.. మిగతా వారి కోసం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

గురువారం ట్రాఫిక్‌ మళ్లించే ప్రాంతాలు ఇవే...

పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లింపు.

ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు.

బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు మళ్లింపు.

సుజాత స్కూల్‌ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు.

Updated : 6 Dec 2023 6:59 PM IST
Tags:    
Next Story
Share it
Top