Home > తెలంగాణ > ట్రాఫిక్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు ఆంక్షలు

ట్రాఫిక్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు ఆంక్షలు

ట్రాఫిక్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడురోజుల పాటు ఆంక్షలు
X

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మూడురోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని కోరారు.

గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్, ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్సార్‌నగర్ టీ జంక్షన్ వద్ద ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాషా టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్, శ్రీరామ నగర్ క్రాస్ రోడ్, సనత్ నగర్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇక ఫతే‌నగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను కట్ట మైసమ్మ దేవాలయం, బేగంపేట వైపు మళ్లించనున్నారు.

ఇక గ్రీన్‌ల్యాండ్స్, బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట్ వైపు వెళ్లే వాహనదారులను ఫుడ్ వరల్డ్ క్రాస్ రోడ్ వద్ద సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రీవనం, ఎస్సార్ నగర్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నట్లు చెప్పారు. అలాగే బేగంపేట, కట్ట మైసమ్మ దేవాలయం వైపు నుంచి బల్కంపేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను గ్రీన్‌ల్యాండ్స్, మాతా దేవాలయం, సత్యం థియేటర్, ఎస్సార్ నగర్ ట జంక్షన్, ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లింపు చేపట్టనున్నారు. ఇక ఎస్సార్‌నగర్ టీ జంక్షన్ నుంచి ఫతే‌నగర్, బల్కంపేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ కోసం బై-లేన్లు, లింక్ రోడ్లు మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి తమకు సహకరించాలని కోరారు.

ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరగనుంది. ఇవాళ ఎదుర్కోలు, రేపు కళ్యాణం, ఎల్లుండి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండడంతో.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం అమ్మవారి కల్యాణానికి 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారని, ఈ సంవత్సరం 15 లక్షల వరకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.


Updated : 19 Jun 2023 9:18 AM IST
Tags:    
Next Story
Share it
Top