Home > తెలంగాణ > Traffic restrictions: ప్రమాణ స్వీకారం నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions: ప్రమాణ స్వీకారం నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions: ప్రమాణ స్వీకారం నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
X

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో (LB Stadium) మ‌ధ్యాహ్నం 1.04 గంట‌ల‌కు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తిచేసింది. ఈనేప‌థ్యంలో ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆంక్షలు అమలులో ఉంటాయని నగర అదనపు పోలీసు (ట్రాఫిక్‌) కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఈ సమయంలో పలు రోడ్లను మూసివేయడంతోపాటు పలు రూట్లలో వాహనాలను దారిమళ్లించనున్నారు పోలీసులు.

ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ జంక్షన్‌ (పబ్లిక్‌ గార్డెన్‌) నుంచి వచ్చే ట్రాఫిక్‌.. బషీర్‌బాగ్‌ బాబు జగ్జీవన్‌రాం(బీజేఆర్‌) విగ్రహం కూడలి వైపు అనుమతించరు. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నాంపల్లి, చాపెల్‌ రోడ్డు వైపు పంపిస్తారు.

గన్‌ఫౌండ్రి SBI నుంచి BJR సర్కిల్ వైపు ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ వద్ద చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

బషీర్‌బాగ్‌ సర్కిల్ నుంచి బీజేఆర్‌ సర్కిల్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు నో ఎంట్రీ. బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ సర్కిల్ నుంచి కింగ్‌కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రూట్ లో వాహనాలకు అనుమతినిచ్చారు.

సుజాత పబ్లిక్‌ స్కూల్‌ లేన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ భవనం వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్కూల్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌ వైపు పంపిస్తారు.

పంజాగుట్ట, వి.వి.విగ్రహం సర్కిల్, రాజీవ్‌గాంధీ విగ్రహం, నిరంకారి, పాత సైఫాబాద్‌ ఠాణా, లక్డీకాపూల్, ఇక్బాల్‌ మినార్, రవీంద్రభారతి, ట్రాఫిక్‌ పోలీసు కాంప్లెక్స్, బషీర్‌బాగ్, బీజేఆర్‌ స్టాట్యూ సర్కిల్ , ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్‌ సర్కిల్, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ సర్కిళ్ల వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

రవీంద్రభారతి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్టేడియం మెయిన్ గేట్ (ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ భనం ముందు) ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద డైవర్షన్‌ తీసుకోవాలి. నాంపల్లి స్టేషన్‌ రోడ్‌ వైపు వెళ్లాలి.

న‌గ‌ర‌వాసులు, వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ దారుల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఇబ్బందులుంటే 9102033626 నంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌ని సూచించారు.




Updated : 7 Dec 2023 4:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top