Home > తెలంగాణ > Traffic Diversions In Hyderabad : చూసుకుని వెళ్లండి.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Diversions In Hyderabad : చూసుకుని వెళ్లండి.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Diversions In Hyderabad : చూసుకుని వెళ్లండి.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
X

సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో అక్టోబర్ 22వ తేదీన హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. లుంబిని పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ లపై ఆదివారం (అక్టోబర్ 22) మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆ టైంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పుకొచ్చారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా:

• తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు.

• సికింద్రాబాద్ ను నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కర్బాలా మైదాన్ దగ్గర బైబిల్ హౌస్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు డైవర్ట్ చేస్తారు.

• పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్ రోటరీ ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర ఐమాక్స్ రూట్లో మళ్లిస్తారు.

• సికింద్రాబాద్ వచ్చే వాహనాలకు అప్పర్ ట్యాంక్ బండ్ పైకి నో ఎంట్రీ

• హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అంబేద్కర్ స్టాచూ వైపు నుంచి ట్యాంక్ బండ్ పైకి నో ఎంట్రీ.

Updated : 21 Oct 2023 8:16 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top