Home > తెలంగాణ > చూసుకుని వెళ్లండి.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

చూసుకుని వెళ్లండి.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

చూసుకుని వెళ్లండి.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
X

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా.. రేపు హైదరాబాద్ కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ కారణంగా రాష్ట్రపతి ప్రయాణించే రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రేపు రాష్ట్రపతి ముర్ము హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.

ఈ సందర్భంగా వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ రూట్లలో వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు పోలీసులు. ఈ క్రమంలో వాహనదారులు వేరే మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Updated : 17 Dec 2023 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top