Home > తెలంగాణ > కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తండ్రి ఆత్మహత్య

కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తండ్రి ఆత్మహత్య

కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి.. తండ్రి ఆత్మహత్య
X

సికింద్రాబాద్‌ సిటీలోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల భవానీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన బిడ్డలిద్దరికీ నిద్ర మాత్రలు ఇచ్చిన తండ్రి తాను కూడా తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బయల్దేరి ఘటనాస్థలానికి వెళ్లారు. ఇంట్లో ఇద్దరు చిన్నారులతో కలిసి ఆ తండ్రి విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహాల పక్కనే నిద్రమాత్రలు పడి ఉన్నాయి. మృతులను తండ్రి శ్రీకాంత్‌ చారి (42), కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) గా గుర్తించారు. రాత్రి భోజనం చేసిన వీరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.




Updated : 13 Oct 2023 9:18 AM IST
Tags:    
Next Story
Share it
Top