Home > తెలంగాణ > DSC,Group 2: యువతి ప్రాణం తీసిన పరీక్షల వాయిదా..

DSC,Group 2: యువతి ప్రాణం తీసిన పరీక్షల వాయిదా..

DSC,Group 2: యువతి ప్రాణం తీసిన పరీక్షల వాయిదా..
X

హైదరాబాద్ అశోక్ నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రవళిక అనే యువతి హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన ప్రవళిక అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే గ్రూప్ 2, డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా పడడం వల్లే యువతి ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. పోటీ పరీక్షల అభ్యర్థులు సహా ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యార్థులకు మద్ధతుగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సహా సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత లాఠీఛార్జి చేయగా.. అభ్యర్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చివరకు 1.30కు ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక పేరుమీద వాట్సప్ గ్రూపుల్లో ఓ సూసైడ్ నోట్ చక్కర్లు కొడుతోంది.

‘‘అమ్మా.. నన్ను క్షమించండి. నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా.. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి’’ అని ఆ లేఖలో ఉంది.



Updated : 14 Oct 2023 2:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top