బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్..!
X
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో యువకుడి మృతి కలకలం రేపుతోంది. విచారణ కోసం స్టేషన్‌కు తీసుకురాగా బెంచిపై కూర్చున్న యువకుడు ఫిట్స్‌తో చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే మృతుడి శరీరంపై కొట్టిన గాయాలున్నాయని.. పోలీసులే చంపారని ఆ యువకుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
బెల్లంపల్లిలోని పెద్దనపల్లి కాలనీకి చెందిన కీర్తి అంజి గోనె సంచుల గోదాంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఇంటి వద్ద బాబాయ్తో అతడికి గొడవ జరిగింది. ఈ విషయంపై యువకుడి బాబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అంజిపై కేసు నమోదు చేసి ఆదివారం రాత్రి స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లోని బెంచీపై కూర్చున్న అంజి ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడని పోలీసులు చెప్పారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో జడ్జి అజయ్‌కుమార్ పర్యవేక్షణలో వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అంజి మృతిపై విచారణ చేపట్టాలని అన్న మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అంజి మృతికి టూ టౌన్ పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అంజి మృతదేహంపై గాయాలున్నాయని, పోలీసుల దెబ్బలు తాళలేక మృతి చెందాడని జడ్జి దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు.
బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2023
మంచిర్యాల - బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు.
ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి… pic.twitter.com/xV9RCXBZ3c