Home > తెలంగాణ > అత్తింటి వేధింపులకు గర్భిణీ బలి.. కొడుకుతో సహా...

అత్తింటి వేధింపులకు గర్భిణీ బలి.. కొడుకుతో సహా...

అత్తింటి వేధింపులకు గర్భిణీ బలి.. కొడుకుతో సహా...
X

గర్భంలో శిశువు.. పక్కన నాలుగేళ్ల కొడుకు.. అయినా ఆమె ఘోర నిర్ణయం తీసుకుంది. తనకు భవిష్యత్ లేదనుకుని.. కొడుకు భవిష్యత్ను కూడా తనతోనే తీసుకెళ్లింది. తాను పోతే కొడుకుని ఎవరు చూసుకుంటారో అని అనుకుందో ఏమో.. కొడుకుకు ఊరేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. గుండెల్ని పిండేసే ఈ ఘటన హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో జరిగింది.

ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విశ్వనాథ్, శిరీష దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కొడుకు మనీష్ ఉన్నాడు. అయితే గతకొంత కాలంగా శిరీషను అత్తింటివారు వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శిరీష మరోసారి గర్భం దాల్చింది. కడుపుతో ఉన్న ఆమె ఈ వేధింపులను తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే గత రాత్రి కఠిన నిర్ణయం తీసుకుంది.

ముందుగా తన కొడుకుకు ఉరేసింది. ఆ తర్వాత తాను కూడా ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలంచి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


Updated : 24 Jun 2023 10:55 AM IST
Tags:    
Next Story
Share it
Top