Home > తెలంగాణ > Mancherial: తోటి విద్యార్థుల వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలి..

Mancherial: తోటి విద్యార్థుల వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలి..

Mancherial: తోటి విద్యార్థుల వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలి..
X

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్లో విషాదం చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల వేధింపులతో డిగ్రీ విద్యార్ధి కామెర ప్రభాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాస్ మందమర్రి మండలం పొన్నారం ఎస్సీ హాస్టల్లో ఉంటూ మంచిర్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫస్టీయర్ చదువుతున్నాడు. ఇటీవల అతడు ఎన్సీసీకి ఎంపికయ్యాడు. దీంతో తోటి విద్యార్థులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రభాస్ దాచుకున్న డబ్బులు చోరీకి గురయ్యాయి. దీనిపై తోటి విద్యార్థులను ప్రభాస్ ప్రశ్నించగా.. ఐదుగురు విద్యార్థులు అతడిపై దాడి చేశారు. నిత్యం వేధింపులకు పాల్పడడడంతో మనస్థాపం చెందిన ప్రభాస్ ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated : 5 Oct 2023 1:58 PM IST
Tags:    
Next Story
Share it
Top