Home > తెలంగాణ > ఇద్దరు పెళ్లాల పోరు.. భరించలేక భర్త ఏం చేశాడంటే..?

ఇద్దరు పెళ్లాల పోరు.. భరించలేక భర్త ఏం చేశాడంటే..?

ఇద్దరు పెళ్లాల పోరు.. భరించలేక భర్త ఏం చేశాడంటే..?
X

అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. విడాకుల సమయంలో ఓ ఒప్పందం చేసుకున్నారు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఇద్దరి భార్యల మధ్య పోరు మొదలైంది. ఈ పోరు భరించలేని భర్త ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన నిజమాబాద్ జిల్లా నవీపేట మండలంలో జరిగింది.

నిజాంపూర్‌కు చెందిన కుర్మ మారుతికి కొత్తపల్లికి చెందిన మహిళతో 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కూతురు పుట్టిన తర్వాత కాపురంలో గొడవలు అవ్వగా.. పెద్దల సమక్షంలో పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకున్నారు. కూతురు పెద్ద అయిన తర్వాత తండ్రి పెండ్లి చేసి ఇవ్వాలని అప్పుడే ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఆమె బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.

ఆ తర్వాత మారుతి మహారాష్ట్రకు చెందిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే మొదటి భార్య వచ్చి తన కూతురి పెళ్లి చేయాలని లేకపోతే ఎకరం పొలంలో సగం ఇవ్వాలని డిమాండ్ చేసింది. మొదటి భార్యకు పొలం ఇస్తే తాను కాపురం చేసేది లేదని రెండో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరి భార్యల గొడవతో మనస్థాపం చెందిన మారుతి తన పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated : 6 Aug 2023 1:11 PM IST
Tags:    
Next Story
Share it
Top