Home > తెలంగాణ > టెట్ పరీక్ష కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి

టెట్ పరీక్ష కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి

టెట్ పరీక్ష కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి
X

సంగారెడ్డి జిల్లాలోని టెట్‌ పరీక్ష కేంద్రంలో విషాదకరమైన సంఘటన జరిగింది. టెట్ రాసేందుకు వచ్చిన ఓ 8 నెలల గర్భిణి పరీక్ష హాలులోనే విగతజీవిగా మారింది. పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలనే తొందరలో పరిగెత్తుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. పరీక్ష కేంద్రంలోనే కళ్లు తిరిగి కుప్పకూలింది. ఈ ఘటనతో పరీక్ష కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష రాసేందుకు లక్షలాది మంది అభ్యర్థులు ఎగ్జామ్ హాల్‏కు చేరుకున్నారు. పటాన్‎చెరు మండలం ఇస్నాపూర్ నుంచి రాధిక అనే 8 నెలల గర్భిణి పరీక్ష రాసేందుకు వచ్చింది. పరీక్షకు ఎక్కడ ఆలస్యం అవుతుందో అనే కంగారుతో వేగంగా పరిగెత్తుకుంటూ సెంటర్‏లోకి వెళ్లింది. అంతే ఒక్కసారిగా బీపీ పెరిగిపోయి హాల్‎లో కుప్పకూలిపోయింది. పరిస్థితి గమనించిన ఇన్విజిలేటర్ మహిళ కుటుంబానికి సమాచారం అందించారు. రాధికను ఆమె భర్త అరుణ్ వెంటనే స్థానికంగా ఉన్న పటాన్‎చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే గర్భిణి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గర్భిణి మరణంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 8 నెలల గర్భిణి అయినా రాత్రింబవళ్లు చదివి ఈ పరీక్ష రాసేందుకు సిద్ధమైందని, తీరా పరీక్ష రాయడానికి వస్తే ప్రాణాలే పోయాయంటూ ఆమె భర్త కంటతడి పెట్టుకున్నాడు. ఈ దృశ్యం అందరినీ తీవ్రంగా కలచివేసింది.

Updated : 15 Sep 2023 8:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top