Home > తెలంగాణ > తెలంగాణలో బదిలీల పర్వం..25 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

తెలంగాణలో బదిలీల పర్వం..25 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

తెలంగాణలో బదిలీల పర్వం..25 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
X

తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సర్కారు బదీలీలు చేపడుతున్నది. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను బదీలీలు చేపడుతున్నది. ఇప్పటికే రెవెన్యూశాఖలో పెద్ద ఎత్తున అధికారులను బదిలీలు చేసిన సర్కార్ మరోసారి 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు స్థాన చలనం కలిగింది. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2 పరిధిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తహశీల్దార్లను.

ఈ ఏడాది జూన్‌ 30 నాటికి పదవీ విరమణ చేయనున్న మరో 17 మంది తహసీల్దార్‌లను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. మల్టీజోన్‌-1 పరిధిలో మొత్తం 81 మంది తహశీల్దార్‌లు, మల్టీజోన్‌-2 పరిధిలో మొత్తం 48 మంది తహశీల్దార్‌లకు స్థానచలనం కలిగించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది.వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఎం. నగేష్, వరంగల్ అదనపు కలెక్టర్‌గా గట్టు సంధ్యారాణి, సికింద్రాబాద్ ఆర్డీవోగా ఎం. దశరథ, హుజురాబాద్ ఆర్డీవోగా శకుంతల, హైదరాబాద్ ఆర్డీవోగా కే. మహిపాల్, కీసర ఆర్డీవోగా కే.వెంకట ఉపేందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఆర్డీవోగా కొప్పుల వెంకట్ రెడ్డి, జహీరాబాద్ ఆర్డీవోగా ఎస్. రాజు, వరంగల్ డీఆర్వోగా కనుగుల శ్రీనివాస్, నల్లగొండ డీఆర్వోగా డీ. రాజ్యలక్ష్మీ, సంగారెడ్డి డీఆర్వోగా డీ. పద్మజా రాణిలను నియమించారు. భద్రాద్రి రామాలయ ఈవోగా ఎల్. రమాదేవిని కొనసాగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 16 Feb 2024 8:29 PM IST
Tags:    
Next Story
Share it
Top