హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రూల్స్ మారాయ్
X
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఔటర్లో ప్రయాణికులు పాటించాల్సిన స్పీడ్ లిమిట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సోమవారం జారీ చేసింది. స్పీడ్ లిమిట్‌ను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్‌తో ఇకపై వాహనాలు 120 కిలమీటర్ల స్పీడుతో ఓఆర్ఆర్లో దూసుకెళ్లొచ్చు. లైన్ 1, 2లలో కనిష్టంగా గంటకు 80 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కి.మీ.ల స్పీడుతో వెహికల్స్ ప్రయాణించవచ్చు. అంతకు ముందు ఈ లైన్లలో గరిష్ట వేగం 100 కి.మీ.లుగా ఉండేది. ఈ వేగాన్ని మించి ఏ వాహనం వెళ్లినా ఫైన్ విధించేవారు. తాజాగా స్పీడ్ లిమిట్ 120కి.మీ.లకు పెంచడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణ సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఈ కొత్త రూల్స్ డ్రైవింగ్‌లో క్రమశిక్షణను తీసుకువస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ లక్ష్యం అని తెలిపారు.
ఓఆర్ఆర్లో కొత్త రూల్స్ ఇవే :
* లేన్ 1, 2 లో స్పీడ్ లిమిట్ 100-120 కి.మీ.లు.
* లేన్ 3,4 లో స్పీడ్ లిమిట్ 80-100 కి.మీ.లు.
* లేన్ 5లో స్పీడ్ లిమిట్ 40 కి.మీ.లు.
* ఓఆర్ఆర్లో 40 కి.మీ.ల స్పీడ్ కన్నా తక్కువ వెళ్లే వెహికల్స్‌కు నో ఎంట్రీ.
* ఎట్టిపరిస్థితుల్లోనూ లేన్ల మధ్య జిగ్-జాగ్ మూమెంట్‌కు అనుమతి లేదు.
* లేన్‌లను మార్చాలనుకునే వారు తప్పనిసరిగా ఇండికేటర్ లైట్లను ఉపయోగించాలి.
* ఓఆర్‌ఆర్‌లోని నాలుగు లేన్‌లలో వాహనం ఎక్కడా ఆగకూడదు. ప్రయాణికులను ఎక్కించుకోకూడదు.
* ఓఆర్ఆర్పై టూవీలర్స్, పాదచారులకు నో ఎంట్రీ.