Home > తెలంగాణ > హైదరాబాద్లో ఆటోపై కూలిన భారీ చెట్టు.. డ్రైవర్ స్పాట్లోనే ..

హైదరాబాద్లో ఆటోపై కూలిన భారీ చెట్టు.. డ్రైవర్ స్పాట్లోనే ..

హైదరాబాద్లో ఆటోపై కూలిన భారీ చెట్టు.. డ్రైవర్ స్పాట్లోనే ..
X

హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోపై భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.





సోమాజిగూడ ఎమ్మెస్ మక్తాకు చెందిన మహ్మద్ గౌస్ పాషా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హిమాయత్ నగర్ నుంచి బషీర్ బాగ్ వైపు ఆటోలో వెళ్తున్నాడు. హైదర్ గూడలోని ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ఆటోను నిలిపాడు. ఈ క్రమంలో ఫుట్ పాత్పై ఉన్న భారీ చెట్టు కూలి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో పాషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనలో పాషా ఆటో ముందు ఉన్న ఇంకో ఆటో కూడా ధ్వంసం అయినట్లు పోలీసులు తెలిపారు. డీఆర్ఎఫ్ టీం ప్రమాదస్థలికి చేరుకుని భారీ వృక్షాన్ని తొలగించింది. హిమాయత్ నగర్ డివిజన్లో 15 నుంచి 20 చెట్ల వరకు కూలిపోయే స్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.


Updated : 2 Sept 2023 4:18 PM IST
Tags:    
Next Story
Share it
Top