Home > తెలంగాణ > కేబీనెట్ కీలక నిర్ణయం.. మెట్రో విస్తరణ.. కొత్త రూట్లు ఏవంటే..?

కేబీనెట్ కీలక నిర్ణయం.. మెట్రో విస్తరణ.. కొత్త రూట్లు ఏవంటే..?

కేబీనెట్ కీలక నిర్ణయం.. మెట్రో విస్తరణ.. కొత్త రూట్లు ఏవంటే..?
X

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో మెట్రో రైలును విస్తరించేందుకు సిద్ధం అయింది. దాదాపు రూ. 60 వేల కోట్లతో మెట్రో విస్తరిస్తామని సోమవారం (జులై 31) సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మెట్రో విస్తరణకు కేబీనెట్ ఆమోదం కూడా తెలిపిందని అన్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరిస్తామని తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ఏ ఏ ప్రాంతాలకు విస్తరిస్తారన్న అంశంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

మెట్రో ఫేజ్ - 3లో అందుబాటులోకి వచ్చే మార్గాలు

బీహెచ్ఇఎల్ - పటాన్ చెరు - ఇస్నాపూర్ కారిడార్

ఎల్ బీ నగర్ - హయత్ నగర్ - పెద్ద అంబర్ పేట్ కారిడార్

శంషాబాద్ జంక్షన్ మెట్రో స్టేషన్ - కొత్తూర్ - షాద్ నగర్ కారిడార్

ఉప్పల్ - ఘట్కేసర్ - బీబీనగర్ కారిడార్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ - తుక్కుగూడ ఓఆర్ఆర్ - మహేశ్వరం క్రాస్ రోడ్ కందుకూరు కారిడార్

తార్నాక - ఈసీఐఎల్ ఎలివేటెడ్ మెట్రో

ఓఆర్ఆర్ మెట్రో కారిడార్స్

ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో మార్గం


డబుల్ డెక్కర్ మెట్రో

జేబీఎస్ - తూంకుంట

ప్యారడైజ్ జంక్షన్ - కొంపల్లి - కండ్లకోయ

Updated : 31 July 2023 10:10 PM IST
Tags:    
Next Story
Share it
Top