Home > తెలంగాణ > దసరాకే కాదు.. క్రిస్మస్, సంక్రాంతి సెలవులనూ ప్రకటించిన సర్కార్

దసరాకే కాదు.. క్రిస్మస్, సంక్రాంతి సెలవులనూ ప్రకటించిన సర్కార్

దసరాకే కాదు.. క్రిస్మస్, సంక్రాంతి సెలవులనూ ప్రకటించిన సర్కార్
X

తెలంగాణ పెద్ద పండుగ బతుకమ్మ, దసరా పండగలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా.. క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన విడుదల చేసింది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజుల దసరా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతోపాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగతా పండగల సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు 5 రోజులపాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజు సెలవు ఉంటుందని పేర్కొంది. ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజుల సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. బోగి, సంక్రాంతి, కనుమ పండగలతో కలిపి 6 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఏపీ ప్రభుత్వం కూడా దసరా పండగకు సెలవులు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్‌ ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది. ఈ సెలవులు అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఉంటాయి. 24వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక, క్రిస్మస్ సెలవులను కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ సెలవులను 7 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. ఇక జనవరి 12వ తేదీ నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.




Updated : 4 Oct 2023 3:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top