Home > తెలంగాణ > Traffic Challans : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్

Traffic Challans : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్

Traffic Challans : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్
X

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. గతంలో ఇచ్చిన దానికంటే ఈ సారి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చింది. టూవీలర్ చలాన్లకు 80శాతం డిస్కౌంట్ ఇచ్చారు(Telangana Police Announce 80% OFF On Traffic Challans). ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90శాతం, ఆటోలు, ఫోర్ వీలర్స్కు 60శాతం, భారీ వాహనాలపై 50శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. వాహనదారులు ఆన్లైన్, మీసేవా ద్వారా చలాన్లను చెల్లించవచ్చు.

2022లో గత ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉంటే.. వీటిని వసూలు చేసేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇవ్వగా.. దీంతో వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు జనం ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలు అయినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

Updated : 22 Dec 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top