Home > తెలంగాణ > తెలంగాణలో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన.. జీవో జారీ

తెలంగాణలో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన.. జీవో జారీ

తెలంగాణలో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన.. జీవో జారీ
X

తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. శుక్రవారం నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికరుల పాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన జీవోను రేవంత్ సర్కార్ జారీ చేసింది. సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్లు ఉన్నా ప్రభుత్వం మాత్రం ప్రత్యేకాధికారుల పాలన వైపే మొగ్గు చూపింది. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం కష్టమని మంత్రి సీతక్క గతంలోనే చెప్పారు. దీంతో ఫిబ్రవరి 2 నుంచి గ్రామాలు అధికారుల పాలనలోకి వెళ్తున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2019 జనవరి 21, 25, 30న మూడో విడుతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇవాళ్టితో వారి పదవీకాలం ముగియనుంది. అయితే జూన్ వరకు తమనే కొనసాగించాలని సర్పంచులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ప్రత్యేక అధికారుల పాలనకే జై కొట్టింది. గెజిటెడ్ ఆఫీసర్లనే ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలుస్తోంది. మొదట నాన్ గెజిటెడ్ ఆఫీసర్లను సైతం ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం భావించింది. అయితే తమకంటే పైస్థాయి వాళ్లనే ప్రత్యేక అధికారులుగా నియమించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు. దీంతో గెజిటెడ్ ఆఫీసర్లు మాత్రమే ప్రత్యేకాధికారులుగా నియామకం కానున్నారు.

Updated : 1 Feb 2024 11:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top