Home > తెలంగాణ > E-KYC : రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు

E-KYC : రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు

E-KYC : రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువు పొడిగింపు
X

రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ-కేవైసీ గడువును పొడిగించింది. ఈ నెల 31తో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ గడువు ముగియనుంది. అయితే ఆ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 75శాతం మాత్రమే ఈ-కేవైసీ పూర్తైంది. అయితే దానిని వంద శాతం చేసే ఉద్దేశ్యంతో గడువును ఫిబ్రవరి 29వరకు పొడిగించారు. జీహెచ్ఎంసీ మినహా తెలంగాణ అంతటా ఈ-కేవైసీ బాగా జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ క్రమంలో ఈ-కేవైసీని వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

కాగా బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. రేషన్ డీలర్లను సంప్రదించి వేలిముద్ర ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకొవాల్సిందిగా అధికారులు సూచించారు. రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. గత 9ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. పైగా పాతవాటిలో ఎటువవంటి మార్పులు చేయలేదు. చాలా చోట్ల చనిపోయిన వారికి కూడా రేషన్ కార్డులో పేరు ఉండడంతో రేషన్ అందుతోంది. దీంతో ఈ-కేవైసీని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.


Updated : 28 Jan 2024 2:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top