Home > తెలంగాణ > TRT Notification 2023 : టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెండ్రోజుల్లో టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్

TRT Notification 2023 : టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెండ్రోజుల్లో టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్

TRT Notification 2023 : టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెండ్రోజుల్లో టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్
X

టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈసారి డీఎస్సీ ద్వారానే టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 6,500లకుపైగా పోస్టుల్లో 5089, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసిన అనంతరం రెండురోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సబిత ప్రకటించారు.


తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గురుకులాల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావడంతో 15లక్షలు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు.




Updated : 24 Aug 2023 1:47 PM IST
Tags:    
Next Story
Share it
Top