Home > తెలంగాణ > దిగొచ్చిన తమిళిసై.. బిల్లుపై ఎట్టకేలకు..

దిగొచ్చిన తమిళిసై.. బిల్లుపై ఎట్టకేలకు..

దిగొచ్చిన తమిళిసై.. బిల్లుపై ఎట్టకేలకు..
X

టీఎస్ ఆర్టీసీ వీలీన బిల్లు ఆమోదంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీనితో ఇవాళే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ అధికారులతో గవర్నర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తనకున్న ప్రశ్నలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే బిల్లును ఆమోదం తెలుపుతున్నట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. తమిళిసై ఆమోదంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి.

ఆర్టీసీ బిల్లు పాస్ కు ఆమోదం లభించడంతో ఇప్పటివరకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. దీనితో బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సమాయత్తం అవుతుంది. బిల్లుపై చర్చించేందుకు గవర్నర్‌ తమిళిసై అధికారులకు సమయమిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్‌ సమావేశం అయ్యారు. ఇక, రవాణాశాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు సహా ఆర్టీసీకి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన సందేహలను అడిగారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై అధికారులు సమాధానం చెప్పారు.ఈ సమాధానాలపై గవర్నర్ తమిళిసై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ తరువాత కొద్దిసేపటికే ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతున్నట్టు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్‌తో సమావేశమయ్యారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే.. బిల్లును స్పీకర్ అనుమతితో టేబుల్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 6 Aug 2023 9:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top