Home > తెలంగాణ > గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీపై తమిళిసై సీరియస్

గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీపై తమిళిసై సీరియస్

గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీపై తమిళిసై సీరియస్
X

పంద్రాగస్టు రోజున అర్థరాత్రి వేళ ఓ గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన హైదరాబాద్‎లో సంచలనంగా మారిన విషయం తెలసిందే. రాత్రి 11 గంటల సమయంలో మహిళను పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్లి లాఠీలతో దారుణంగా కొట్టి పోలీసులు ఆమెను తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సీరియస్ అయ్యారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 48 గంటల్లో ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , డీజీపీ, రాచకొండ సీపీలను ఆదేశించారు. అదే విధంగా బాధిత మహిళకు అండగా ఉండాలని రెడ్‌క్రాస్‌ సొసైటీకి గవర్నర్ సూచించారు.

ఆగస్టు 15 రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్‌ సమయంలో ఎల్బీనగర్‌ క్రాస్ రోడ్‏లో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్లారు. అంతటితో ఆగలేదు సెక్షన్‌ 290 కింద కేసు కూడా నమోదు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గిరిలో మీర్‌పేటకు చెందిన ఓ మహిళ.. తమను ఎందుకు ఇక్కడకు తీసుకొచ్చారని పోలీసులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్‌, సుమలతలు ఆమెను లాఠీలతో దారుణంగా కొట్టారు. ఆమెపై థార్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ ఘటనతో మహిళ ఎడమ మోకాలి పైభాగం పూర్తిగా కమిలిపోయింది. అరికాళ్లపై పోలీసులు కొట్టడంతో నడవలేకపోయింది. రాత్రంతా ఆ గిరిజన మహిళను పోలీసులు స్టేషన్‌లోనే ఉంచారు. ఆ తర్వాత ఉదయం ఇంటికి పంపించారు. ఈ వ్యవహారంలో రాత్రి డ్యూటీలో ఉన్న ఎస్సై పైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సై సూచనతోనే దాడి జరిగినట్లు బాధిత మహిళ ఆరోపించింది. అతనిపై కేసు నమోదు చేయడంతో పాటు విచారణకు ఆదేశించారు కమిషనర్‌ చౌహాన్‌.అనంతరం మహిళపై దాడి చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ శివశంకర్‌, మహిళా కానిస్టేబుల్‌ సుమలతను సస్పెండ్‌ చేశారు. ఈ దారుణమైన ఘటనపై స్పందించిన గవర్నర్ 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని చీఫ్‌ సెక్రటరీ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌‏‎ను ఆదేశించారు.

Updated : 19 Aug 2023 9:14 AM IST
Tags:    
Next Story
Share it
Top