Singareni: సింగరేణి కార్మికులకు కేసీఆర్ కానుక.. రికార్డ్ స్థాయిలో బోనస్ ప్రకటన
X
"సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు." లాభాల్లో 32 శాతం వాటాను బోనస్ గా కార్మికులకు ఇవ్వాలని ఆదేశించారు.(Bonus for Singareni workers) దీనికి సంబంధించిన ఉత్తర్వులు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగరావు జారీ చేశారు.(singareni employee bonous) 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో రూ.2,222 కోట్ల మేర లాభాలు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లాభాల్లోని 32శాతం వాటా అంటే.. రూ.711 కోట్లను కార్మికులకు అందించనున్నారు. దసరా పండుగకు వారం రోజుల ముందే ఈ నిధులను కార్మికులు, ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు.
దీంతో సుమారు 42,390 మంది ఉద్యోగులకు (ఒక్కో కార్మికుడికి) రూ.1.60లక్షలు లబ్ధి చేకూరనుంది. గతేడాది సంస్థ లాభాల్లో 30 శాతం అంటే రూ. 368 కోట్లు వాటాను బోనస్ గా ఇవ్వగా.. అంతకు ముందు 29 శాతం వాటాను బోనస్ గా ఇచ్చారు. పోయిన ఏడాదికంటే ఈసారి 2 శాతం బోనస్ పెరిగింది. కాగా ఇటీవలే 11వ వెజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేసింది.